చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్రధాన నిందితులు కిషన్ మోదుగుమూడి, అతని భార్య చంద్రకళను అమెరికా పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. కిషన్, చంద్రకళ అసలు భార్యాభర్తలు కారని, లగ్జరీ జీవితం గడిపేందుకే ఇలాంటి నేరాలు చేసేందుకు వారిద్దరూ ఇలా నటిస్తున్నారని ఆరోపించింది.
see also:పవన్‌తో పరిచయం కొనసాగుతుంది..!
ఈ క్రమంలోనే ఓ సారి తాను అమెరికా వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను ప్రస్థావించింది. తాను బస చేసిన హోటల్ దగ్గరకు కిషన్, చంద్రలకు సంబంధించిన ఓ వ్యక్తి అర్థరాత్రి సమయంలో వచ్చి గది తలుపు తట్టాడని, ఆ సమయంలో అతను ప్రవర్తించిన తీరుతో కోపం వచ్చి అతని చంప పగలగొట్టానని చెప్పుకొచ్చింది. అమెరికాలో డబ్బు ఆశ చూపో.. లేక భయపెట్టో మన దేశం అమ్మాయిలను లొంగదీసుకుంటారని, ఇలా మోసపోయిన అమ్మాయిలను కాపాడాలని ప్రధాని మోడీకి పూనమ్ కౌర్ విజ్ఞప్తి చేసింది.