గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇవాళ JDS చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ కలిశారు .రాష్ట్ర రాజధాని హైదరాబాద్ టూర్ లో భాగంగా శనివారం రాత్రి సిటీకి చేరుకున్న దేవెగౌడ..ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ దేవెగౌడకు ఘనస్వాగతం పలికారు. దేవగౌడను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.
ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. కేసీఆర్‌తో భేటీ తరువాత మాజీ ప్రధాని నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరారు. ఈ సమావేశంలో మేయర్ రామ్మోహన్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎంపీ సుబ్బిరామిరెడ్డి మనువడి వివాహానికి హాజరయ్యేందుకు శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే.