ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ అప్పుడే అభ్యర్థుల వేటను ప్రారంభించింది.అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా వైజాగ్ పార్లమెంటు స్థానానికి టీడీపీ ప్రస్తుత బీజేపీ ఎంపీ అయిన కంభంపాటి హరిబాబుకు మద్ధతు తెల్పింది. అయితే ప్రస్తుతం వీరి మధ్య ఉన్న మైత్రీ విచ్చిన్నం కావడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ తమ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తుంది.
see also:జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..!
ఈ నేపథ్యంలో ప్రముఖ విద్యాసంస్థ గీతం అధినేత ,ఎమ్మెల్సీ అయిన ఎంవీవీఎస్ మూర్తి వైజాగ్ నుండి బరిలోకి దిగాలని భావించారు. అయితే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన వారసుడైన ..హిందుపూరం టీడీపీ ఎమ్మెల్యే ,బాబుకు స్వయాన వియంకుడైన నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ను బరిలోకి దించాలని ఆయన ఆలోచిస్తున్నారు.
see also:దేశంలోనే ఎటువంటి అవినీతి మరకలేని నేత “చంద్రబాబు”-బుద్దా వెంకన్న ..!
ఈ క్రమంలో ఇప్పటివరకు తన పోలిటికల్ కేరీర్ లో ఓటమి ఎరుగని ఆ పార్టీ సీనియర్ నేత విశాఖలో అందరికీ తేల్సిన మంత్రి గంటా శ్రీనివాస రావు ను బరిలోకి దించాలని మరో వర్గం ఆలోచిస్తుందని సమాచారం. అయితే ఇప్పటివరకు బీసీ సామాజిక వర్గానికి కేటాయించకపోవడంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాసరావును బరిలోకి దించాలని బాబు ఆలోచన అంట.ఎందుకంటే గత ఎన్నికల్లో పీఆర్పీ తరపున బరిలోకి దిగిన అనుభవంతో పాటుగా ఎక్కువ ఓట్లు రావడంతో బాబు పల్లాకి జై కోట్టారు అని తెలుగు తమ్ముళ్ళ టాక్.చూడాలి మరి ఎన్నికల నామినేషన్ చివరి రోజు వరకు అభ్యర్థులను సస్పెన్స్ లో ఉంచే బాబు ఈ ముగ్గురిలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో..!