ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేత టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట్ బీజేపీ ఇంచార్జ్ రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
see also:చంద్రబాబు ఇంటెలిజెన్స్ సర్వేలో.. పది మంది మంత్రుల అడ్రస్ గల్లంతు..!
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వెంకటసత్య ప్రసాద్ మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా టీడీపీ సర్కారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడ్ని అయి టీడీపీలో చేరాను .గత నాలుగేళ్ళుగా రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను అని ఆయన అన్నారు ..