ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి విజయం సాధించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ కరణం బలరాం దాదాపు ముప్పై ఐదేళ్ళ పాటు ఉన్న టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయం
తీసుకున్నారు.వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ చేరిన రోజు నుండి నేటి వరకు ఇరువర్గాల మధ్య వర్గ పోరు .
అంతే కాకుండా పలుమార్లు ఎంపీగా ..ఎమ్మెల్యేగా ..ఎమ్మెల్సీగా పని చేసి ముప్పై ఐదేళ్ళ పాటు పార్టీకోసం అహర్నిశలు కష్టపడిన తనను కాదని మద్యలో అధికారం కోసం పార్టీ మారిన గొట్టిపాటికి చంద్రబాబు నాయుడుతో పాటుగా జిల్లాకు చెందిన నేతలు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం ..కింది స్థాయి క్యాడర్ టీడీపీ పార్టీలో ఉండి అవమానాలను ఎదుర్కుంటున్నారు .ఇన్ని అవమానాలను ఎదుర్కునేది తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే కాబట్టి ఒకమాటగా రానున్న ఎన్నికల్లో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు కరణం వెంకటేష్ ను బరిలోకి దించాలని బాబును బలరాం గట్టిగానే నిలదీశారు. దీంతో కంగు తిన్న బాబు మీకు ఎమ్మెల్సీ ఇచ్చాం కదా…
వెంకటేశ్ కోసం వేరే నియోజకవర్గం ఎంచుకోవాలని సూచించారు. ఈ మాట కరణం బలరాంకు చాలా తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో తాను కూడా అద్దంకిని వదిలేది లేదని కూడా బలరాం గట్టిగానే బదులిచ్చినట్లుగా సమాచారం. అయితే పార్టీ అధినేతగా బాబు
ఓకే చేస్తేనే టీడీపీ టికెట్ లభిస్తుంది కదా. మరి అద్దంకిని గొట్టిపాటికి ఇచ్చేస్తున్నానని బాబు ముఖం మీదే చెప్పడంతో కరణం ఇప్పుడు తన కుమారుడి కోసం ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదని భావిస్తూ గొట్టిపాటి చేరిన దగ్గర నుండి నేటి వరకు ఆయన ఎదుర్కుంటున్నఆయన వైసీపీలోకి జంప్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ హాట్
గా చర్చించుకుంటున్నారు ..