నాటా2018 మెగా కన్వెన్షన్ లో భాగంగా అమెరికాలో తెలంగాణ అభివృద్ధిపై జరుగుతున్న చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డి కి మంత్రి జగదీష్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సూర్యాపేట పట్టణాన్ని గత ప్రభుత్వాలే సిండికేట్లతో నాశనం చేశారన్నారు.
భూ దందాలకు పాల్పడి ప్రజలను హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మీరు ఉంటున్న ఇల్లు(రెడ్ హౌస్) కూడా ఎన్నారై వద్ద ఆక్రమించుకున్నదేనని అన్నారు. సూర్యాపేట నూతన కలెక్టరేట్ కార్యాలయంలో అవినీతి జరిగిందన్న సర్వోత్తమ్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు ఖర్చుపెట్టింది నాలుగు కోట్లైతే మూడొందల కోట్లు ఏ విధంగా అవినీతి జరిగిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
మంత్రి జగదీష్ రెడ్డికి సభికుల నుండి హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొడుతుండగా వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి మధుయాష్కీల నుండి సైతం సర్వోత్తమ్ రెడ్డికి మద్దతు లభించకపోవడంతో తోకముడవక తప్పలేదు