చేనేత కార్మికుల సంక్షేమ కోసం మంత్రి హరీశ్ రావు ఓ కోరిక కోరాగా..దానికి చేనేత జౌళి శాఖమంత్రి వెంటనే ఓకే చేశారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న మమకారాన్ని మరోమారు చాటుకుందని పలువురు ప్రశంసిస్తున్నారు. పూర్వ మెదక్ జిల్లాలోని టెక్సటైల్ రంగంపైన ఈరోజు సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,టెక్స్‌టైల్ శాఖ ఆధికారులతో ఈరోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ చేనేత కార్మికులకు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.
రాష్ర్టంలోని నేతన్నలకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, కొనేళ్ల తర్వతా ముఖ్యమంత్రిగారి దిశా నిర్ధేశంలో చేపట్టిన కార్యక్రమాల ద్వారా నేతన్నలకు సరైన చేయూత లభిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. బతుకమ్మ చీరలు, యూనిఫారాల సరఫరా, ప్రభుత్వం వివిధ శాఖల నుంచి చేసుకునే వస్ర్తాల సేకరణ అర్డర్ల ద్వారా నేతన్నలకు చేతి నిండా పని దొరకడంతోపాటు, గౌరవం ప్రధమైన అదాయం లభిస్తున్నదని మంత్రులు తెలిపారు. దీంతోపాటు నేతన్నకు చేయూత, చేనేత మిత్రా, మగ్గాల ఆధునికీకరణ వంటి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా నేతన్నలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు. ఇలా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతోపాటు, వృత్తి అభివృద్ది పథకాలను నేతన్నలకు వివరించేలా అన్ని జిల్లాల్లో ప్రత్యేక జిల్లా స్ధాయి నేతన్న సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈమేరక జిల్లాస్ధాయి నేతన్న సదస్సును తొలుత సిద్దిపేటలో నిర్వహించాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులు మంత్రులు సూచించారు. ఇవాళ సచివాలయంలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలోని చేనేత కార్మికుల సమస్యలపై మంత్రులు ఈ సమావేశంలో చర్చించారు.
సిద్దిపేట గొల్లభామ చీర కు మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని గోల్కొండ షోరూమ్ లలో వీటిని అందుబాటులో ఉంచుతామని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చెప్పారు. ఇప్పటికే గొల్లభామ చీరలకు ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తోందని దీనికి మరింత ప్రాచుర్యం కల్పించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనికోసం సిద్దిపేటలోని గొల్లభామ చీరలు వేసే 30 మంది చేనేత కార్మికులకు జాఖాత్ లు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు అధికారులను కోరారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలలోని చేనేత కార్మికులకు వర్కింగ్ క్యాపిటల్ త్వరగా ఇచ్చేలా చూడాలని సూచించారు. చేనేత కార్మికుల నుంచి గ్యారంటీలు కోరకుండా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సాయం అందించే విషయాన్ని పరిశీలించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికుల రుణమాఫీ అంశాలపైన సమీక్షలో మంత్రులు చర్చించారు. చేనేత కార్మికులకు ఉన్న మాఫీ సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు జిల్లాల వారిగా ఎంతమందికి రుణమాఫీ జరిగిందో ఆ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మంత్రులను ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులు వినియోగించుకుని మాఫీ అంశం చేనేత కార్మిక వర్గాల్లో తెలిసేలా చేయాలని చెప్పారు.
సిద్దిపేట, దుబ్బాక లో ప్రత్యేక చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు. అదే రీతిలో దుబ్బాక, చేర్యాల, సిద్దిపేటలోని అసంపూర్తిగా ఉన్న సోసైటీల భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అవసరం అయిన నిధులు మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావు కోరగా, మంత్రి కేటీఆర్ అందుకు అంగీకారం తెలిపారు. ఈ సమీక్ష చేనేత శాఖ అధికారులు బతుకమ్మ పండగకు ప్రజలకు ఇచ్చే చీరలను మంత్రులకు, ప్రజాప్రతినిధులకు చూపించారు. వీటిని పరిశీలించిన ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.