ఒకట్రెండు సంవత్సరాల్లో కెరీర్‌ను స్టార్ట్ చేసిన హీరోలందరూ 25వ సినిమాలోకి అడుగు పెట్టారు. కృష్ణా, శ్రీకాంత్ లా వంద, 200 సినిమాలు చేయడం ఇప్పటి జనరేషన్ హీరోలకు కష్టమే. అందుకే 25వ సినిమా చేస్తే ల్యాండ్ మార్క్ దాటినట్టుగా ఫీలవుతున్నారు. ఇలా 25వ సినిమాలో అడుగు పెట్టిన.. పెట్టబోయే హీరోలు ఎవరో తెలుసా..?
ఈ జనరేషన్‌లో హీరోల 25వ సినిమాల మార్క్ నాన్నకు ప్రేమతో మొదలైంది. 2001లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక్ 25వ సినిమా నాన్నకు ప్రేమతో 2016లో రిలీజైంది. 25 సినిమాలు చేయడానికి 15 సంవత్సరాల సమయం తీసుకున్నాడు యంగ్ టైగర్.
25 సినిమాలు పూర్తి చేయడానికి తారక్ పదిహేనేళ్లు తీసుకుంటే సూపర్ స్టార్ మహేష్‌కు 19 ఏళ్లు పడుతుంది. 1999లో రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఇప్పటి వరకు 24 సినిమాలు పూర్తి చేశాడు. 25వ చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. వంశీపైడపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
2002లో జయం సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ 25 సినిమాల ల్యాండ్ మార్క్ ఈ ఏడాది విడుదలైన చల్‌మోహన రంగ చిత్రంతో దాటేశాడు. 25 సినిమాలు పూర్తి చేసేందుకు దాదాపు 16 ఏళ్ల సమయం తీసుకున్నాడు ఈ యంగ్ హీరో.
25 సినిమాలు పూర్తి చేయడానికి కొందరు హీరోలు మినిమమ్ 15 ఏళ్ల సమయం తీసుకుంటే.. మధ్యలో విలన్‌గా టర్న్ తీసుకోవడంతో గోపీ చంద్‌కు 17 ఏళ్లు పట్టింది. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగబ్బాయి విశాల్ 25వ చిత్రం పందెంకోడి – 2 చిత్రంతో అక్టోబర్ 19న వస్తున్నాడు.