ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా రిలీజే కాదు.. అసలు మొదలు కావడం కూడా ఆలస్యమే. ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే ఉంటాయి. బాహుబలి అనుకున్న సమయంలో మొదలు కాకపోవడమే ఇందుకు ఉదాహరణ. అయితే, అప్పుడు బాహుబలికి ఎదురైన పరిస్థితే..ఇప్పుడు మరో సినిమాకు ఎదురు కాబోతోంది. నట రుద్రుటు ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో రాజమౌళి సినిమా నవంబర్‌లో మొదలు కావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే డిసెంబర్‌లో మొదలు కానుందని సమాచారం. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనుకుని ఏడాది అవుతున్నా.. ఆలస్యం కావడానికి కారణమేంటో తెలుసా..?
దర్శకుడు రాజమౌళి స్ర్కిప్ట్ విషయంలో సంతృప్తికరంగా లేకపోవడమే ఇందుకు కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని నెలలుగా జక్కన్న టీమ్ ప్రీ పొడక్షన్ వర్క్‌లో ఉన్నా స్ర్కిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదట. దీంతో నెల రోజులు లేటైనా.. వంద శాతం స్ర్కిప్ట్‌పై సంతృప్తి కలిగితేనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడు రాజమౌళి. దీంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లే డేట్ నెల రోజులు వాయిదా పడి.. ఏడాది చివరకు వెళ్లిపోయింది.