ఆమె స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు… నెం.1 కూడా. అక్కడ ఎంత క్రేజ్ ఉన్నా సౌత్ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు. కానీ, రీసెంట్‌గా రిలీజైన సాంగ్ తనకు బంపర్ ఆఫర్ తీసుకొస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తోంది ఈ భోజ్‌పురి హీరోయిన్. ఇంతకీ ఎవరా హీరోయిన్…? ఏమిటీ ఆ స్టోరీ..? అంటే..!
అమ్రాపాలి.. తెలుగు తెరకు పరిచయం లేని పేరిది. అయితే, భోజ్‌పురిలో మాత్రం ఈమె పేరు మారుమ్రోగి పోతోంది. బుల్లితెర నుంచి వెండి తెరకు వచ్చిన ఈ బొద్దుగుమ్మ భోజ్‌పురిలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా ఎదిగింది. టెలివిజన్ యాంకర్, మోడల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అమ్రపాలి. చిందులేసిన లేటెస్ట్ సాంగ్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. లవ్ కేలియే కుచ్‌బీ కరేగా సినిమాలోని తొహరే కదీర్ అనే పాటను నెల క్రితం యూట్యూబ్‌లో పెట్టగా ఇప్పటి వరకు 89 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్‌కు వచ్చినన్ని వ్యూస్ రావడంతో.. ఈ అమ్మడు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
తొహరే కతీర్ సాంగ్ నెటిజన్లను ఎంతగా ఆకట్టుకున్నా.. ఈ అమ్మడు డ్రీమ్ మాత్రం తీరలేదు. ఈ పాటతోనైనా.. దక్షిణాదిన ఆఫర్స్ వస్తాయనుకుంటే.. ఒక్కటీ దక్కలేదు. బొద్దు గుమ్మలను ఇష్టపడే తమిళ తంబీలైనా ఛాన్సులు ఇస్తారంటే.. అదీ లేదు. మరి అమ్రపాలి భోజ్‌పురికే పరిమితమవుతుందా.? చివరకు ప్రత్యేక గీతమైనా దక్కుతుందో..? లేదో..? మరి.