ఒక్క సినిమాతో ఫేట్ మారడమంటే ఏమిటో.. సుకుమార్‌ను చూసి చెప్పొచ్చు. ఆర్య సినిమాతోనే దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ, కమర్షియల్ డైరెక్టర్‌గా ఇమేజ్ ఇప్పుడే వచ్చింది. దాంతోపాటు కోట్ల రూపాయల డబ్బు వచ్చి పడింది. ఇప్పుడు ఆయన రిచ్ డైరెక్టర్.
సుకుమార్ పంట పండింది. దర్శకుడు సుకుమార్ ఒకప్పుడు కమర్షియల్ డైరెక్టర్ కాదు అనే పేరుండేది. డిఫరెంట్‌గానే తీస్తాడు కానీ.. భారీ హిట్స్ ఇవ్వలేడు అని ట్రేడ్ వర్గాలు భావించేవి. అందుకే సుకుమార్‌తో సినిమాలు చేసేందుకు ఇంతకు ముందు పెద్ద హీరోలు ఎగబడేవారు కాదు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. రంగస్థలం సినిమాతో సుకుమార్ లెక్కలు మార్చేశాడు.
రంగస్థలం సినిమాకు, సుకుమార్‌కు పది కోట్ల రూపాయల పారితోషకం దక్కింది. విడుదలైన తరువాత లాభాల్లో వాటా ఇస్తామని చెప్పారు. దానికి తగ్గట్టే ఇప్పుడు సుకుమార్‌కు మరో ఏడు కోట్లను నిర్మాతలు అందజేశారు. అంతేకాకుండా, నెక్ట్స్ సినిమాను కూడా అదే బేనర్‌లో చేసేలా భారీ పారితోషకం ఇచ్చారు. అంటే, సుకుమార్‌కు రంగస్థలం సినిమాతో ఏడు కోట్ల రూపాయల అదనపు డబ్బుతోపాటు నెక్ట్స్ సినిమాకు డబుల్ పారితోషకం దక్కిందన్న మాట.
రామ్‌చరణ్ నటించిన రంగస్థలం సినిమాను సుకుమార్ మొదలు పెట్టినప్పుడు యావరేజ్‌గా ఆడుతుందని సినీ విశ్లేషకులు సైతం భావించారు. అందుకే సినిమాకు చాలా తక్కువే ఖర్చు పెట్టారు. అయితే, రంగస్థలం ఆల్‌టైమ్ మూడో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. నిర్మాతలకు రూ.40 కోట్ల వరకు లాభాలను మిగిల్చింది. ఈ కాలంలో బాహుబలి తరువాత నిర్మాతకు అంత అమౌంట్ లాభం వచ్చిన తెలుగు సినిమా రంగస్థలం.
సుకుమార్ ఇప్పుడు రంగస్థలం సినిమాతో వచ్చిన డబ్బుతో ఇక నిర్మాతగా సినిమాలు తీయాలనుకుంటున్నాడు. ఇంతకు ముందు కుమారి 21 ఎఫ్ అనే హిట్ చిత్రాన్ని నిర్మించాడు. కానీ, ఆ తరువాత తన బేనర్‌లో సినిమాలను నిలిపేశాడు. ఇప్పుడు తన బేనర్‌పై పలు చిన్న సినిమాలను తెరకెక్కించేందుకు రెడీ అయిపోతున్నాడు.