తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ పాఠశాలో 5వ తరగతి చదువుతున్న ఇదే గ్రామానికి చెందిన అర్జున్ ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగావర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ నేతృత్వంలోని అరూరి గట్టుమల్లు మోమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత శిక్షణ తరగతుల్లో ఆచార్య జయశంకర్ గారి జీవితంపై ఏకధాటిగా అనర్గళంగా దాదాపు 24నిమిషాల పాటు మాట్లాడి విద్యార్థులను విస్మయానికి గురిచేస్తూ, నిర్వాహకులకు ఆ జయశంకరుడి ఆశయాలను నెమరు వేయించాడు.