ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సతీమణి అయిన వైఎస్ భారతి అక్రమాస్తుల కేసులో నిందితురాలు అంటూ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడుకు చెందిన అనుకూల మీడియాగా ముద్రపడిన ఏబీఎన్ ,ఈనాడు పత్రికల్లో పలు కథనాలు ప్రసారమైన సంగతి తెల్సిందే..
అయితే తన సతీమణిపై జరిగిన విషప్రచారంపై వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ రాజకీయంగా తనను ఎదుర్కొనలేక కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారని విరుచుకుపడిన సంగతి విదితమే.. తాజాగా గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా వ్యవహరించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు.
ఆయన వైజాగ్ లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ” జగన్ సతీమణి భారతి పేరును ఈడీలో చేర్చారని వార్తలు విన్నాను కానీ అందులో ఎంతవరకు నిజముందో తెలియదు.. అయితే గతంలో దాఖలు చేసిన చార్జ్ షీట్లో తన పేరు లేదని ఆయన అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..