ఊరంతా ఒకదారి అయితే ఊసకండ్లనొడిది మరొక దారి అన్నట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరు. ఒకపక్క దేశ రాజకీయాలను ,అభివృద్ధిని తన చతురతతో మార్చి భారత రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న మాజీ ప్రధానమంత్రి ,భారతరత్న వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే.
అయితే వాజ్ పేయి మరణాన్ని యావత్తు భారతనీకం తట్టుకోలేకపోతుంది. సామాన్య ప్రజానీకం దగ్గర నుండి ప్రముఖుల వరకు ఆయనకి ఘననివాళులు అర్పిస్తున్నారు. ఈక్రమంలో తన దారి సపరెట్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో నేను మలేషియాకు వెళ్లాను. అక్కడ రోడ్లు చూశాను.
అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చి.. మలేషియా రెండు కోట్ల జనాభా .. బ్రహ్మాండమైన రోడ్లు వేశారు. భారత దేశ జనాభా 120 కోట్లు. కనీసం ఒక్క మంచి రోడ్డు లేదు. ఇది కరక్టా అని ప్రధాని వాజ్‌పేయిని అడిగాను. వెంటనే స్పందించిన ఆయన మంత్రిని పిలిచి మాట్లాడి నేషనల్ హైవేలో రిఫార్మ్ తీసుకువచ్చారు అని అఖరికీ వాజ్ పేయి అంత్యక్రియలు పూర్తికాకముందే తన డబ్బా కొట్టుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అఖరికీ వాజ్ పేయి మరణాన్ని కూడా తన స్వార్థ రాజకీయం కోసం వదలడంలేదు అని సెటైర్లు వేస్తున్నారు..