గత పదకొండు రోజులుగా కేరళ రాష్ట్రం వరదలతో..భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెల్సిందే.. తీవ్రమైన వరదలతో.. వర్షాలతో కేరళ రాష్ట్రం రెండు లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. కొన్ని లక్షల మంది నిరాశ్రయులైనారు. కొన్ని వందల మంది మృత్యు వాతపడ్డారు..
ఈక్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో జర్నీ మూవీతో అందరి మన్నలను పొందిన హీరోయిన్ అనన్య కేరళ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అనన్య పేర్కోంటూనా ఇంటితోపాటు మా బంధువుల ఇండ్లు వరదల్లో చిక్కుకున్నాయి.
శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మేమంతా సురక్షితంగా బయటపడ్డాం. ప్రస్తుతం మేమంతా పెరుంబవూర్‌లోని ఆశా శరత్ (భాగమతి నటి) ఇంట్లో తలదాచుకున్నాం. మేమంతా సురక్షితంగా ఉన్నాం. నన్ను నా కుటుంబాన్ని రక్షించేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. సహాయం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నామని ఆమె కోరింది.