తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు శుభవార్తను ప్రకటించింది సర్కారు. రేషన్ డీలర్ల పలు సమస్యలపై సర్కారు సానుకూలంగా స్పందించింది.ఈ రోజు ఉదయం రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.అనంతరం ఆర్థిక ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గతంలో డీలర్లకు కిలోబియ్యం పై ఇస్తున్న కమీషన్ ఇరవై పైసల నుండి డెబ్బై పైసలకు పెంచుతున్నట్లు తెలిపారు.
అయితే ఈ పెంపు సెప్టెంబర్ నెల మొదటి తారిఖు నుండి అమల్లోకి వస్తుందన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం 2015,అక్టోబర్ ఫస్ట్ తారిఖు నుండి పెండింగ్ లో ఉన్న పలు బకాయిలను కూడా చెల్లిస్తామని ప్రకటించారు..