ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని అత్యవర ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో కోడెలతో పాటు విమానంలో మరో 68మంది ప్రయాణికులున్నారు. ఈఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది. విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి బయల్దేరింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టులోనే ల్యాండింగ్ చేసినట్లు పైలట్ తెలిపారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
