Breaking News
Home / Tag Archives: accident

Tag Archives: accident

వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర తప్పిన ప్రమాదం

ఏపీలోని ఏలూరు జిల్లాలోని  చింతలపూడి నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు.. అధికార వైసీపీకి చెందిన నేత  వున్నమాట్ల రాకడ ఎలీజా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్థంభానికి ఢీ కొట్టింది. అయితే కారులో బెలూన్లు ఓపెన్ అవ్వడంతో ఎలీజా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద …

Read More »

బీహార్‌ లో  ఘోర ప్రమాదం

బీహార్‌ రాష్ట్రంలో  ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని  వైశాలి జిల్లాలోని మన్హార్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ మీడియా కథనాల ప్రకారం మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఓ పూజా ఊరేగింపు కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో నిలబడి ఉండగా.. వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాజీపూర్‌లోని సదర్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు …

Read More »

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం!

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో పది మంది తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. మునగాల మండల కేంద్రం శివారులోని పెట్రోలు బంక్‌ వద్ద ఓ ట్రాక్టర్, లారీని ఢీకొట్టింది. ట్రాక్టర్ రాంగ్ రూట్‌లో వెళ్లడం వల్లనే ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి సమీపంలోని సాగర్ …

Read More »

శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌ నగరం నుండి  తిరువనంతపురం వెళ్తున్న  శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు గుంటూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలోని కంకరగుంట గేటు వద్ద రైల్వేట్రాక్‌పై అడ్డంగా ఇనుపరాడ్‌ను కట్టారు. ఎవరికి అనుమానం రాకుండా దానిపై అట్టముక్కలు పెట్టారు. పది నిమిషాల్లో శబరి ఎక్స్‌ప్రెస్‌ ఈ మార్గంలో వెళ్లే సమయంలో స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన …

Read More »

ఓరేయ్ 230 స్పీడ్ వద్దురా పోతాం.. ప్చ్.. అనుకున్నట్లే అయ్యింది..!

ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌పై సుల్తాన్‌పుర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బీఎమ్‌డబ్ల్యూ కారు కంటైనర్‌ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు ఇంజన్‌ పేలి కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన గత శుక్రవారం జరగగా ఈ ప్రమాదానికి కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సుల్తాన్‌పుర్ సమీపంలో హైవేపై నలుగురు స్నేహితులు బీఎమ్‌డబ్ల్యూ కారులో వెళ్తున్నారు. ఈ …

Read More »

సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి..!

సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మరణించగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. తాజాగా మరో వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. మరణించినవారు, గాయపడిన వారిలో ఏపీ వాసులు ఉన్నారు. గాయపడిన వారిని సిటీలోని అపోలో, యశోద హాస్పిటల్స్‌కి తరలించారు. మృతులు వీరే.. ఈ ఘటనలో  విజయవాడ రామవరప్నాడుకు చెందిన అల్లాడి …

Read More »

వైఎస్‌ విజయమ్మకు తృటిలో తప్పిన ముప్పు..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. కర్నూలులో నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి విజయమ్మ క్షేమంగా బయటపడ్డారు. తర్వాత వేరే కారులో అక్కడ నుంచి వెళ్లారు.

Read More »

మరోసారి గాయపడిన విశాల్

తమిళ స్టార్ హీరో..యువ నటుడు విశాల్ మరోసారి గాయపడ్డాడు. ఇటీవలే ‘లాఠీ’ షూటింగ్ సమయంలో గాయపడ్డ ఈ హీరో కోలుకుని తాజాగా కెమెరా ముందుకొచ్చాడు. చెన్నైలో ఈ తెల్లవారుజామున ‘మార్క్ ఆంటోని’ షూటింగ్ సమయంలో మరోసారి తీవ్రంగా గాయపడ్డట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్ ఆంటోని’.

Read More »

స్వీపర్..20 ఏళ్లకే భర్తను కోల్పోయి.. బ్యాంక్ ఎజీఎంగా..

ఆమె ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఏడో తరగతితోనే చదువు ఆపేసి ఓ బ్యాంక్ బుక్ బైండర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. కొడుకు పుట్టాడు. ఇక అంతా బాగుంటుంది అనుకునేలోపే విథి చిన్నచూపు చూసింది. భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. పసిబిడ్డతో ఒంటరిగా మిగిలింది. ఉద్యోగం చేసేంత చదువు లేదు. చివరకు బిడ్డను పోషించుకునేందుకు భర్త పని చేసిన బ్యాంకులోనే స్వీపర్‌గా పనిచేసింది. కేవలం …

Read More »

మెట్రోపిల్లర్‌ను ఢీ కొట్టిన బైకు.. ఇద్దరు ష్పాట్‌డెడ్

బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అతివేగంతో మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన మోహిన్‌ (23), ఒబేద్‌(22) హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఎర్రమంజిల్‌ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్‌ ఆలయం ఎదురుగా మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు బైకు ధ్వంసం అయింది. పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino