మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి చెప్పారు. ఈ మేరకు అధికారులు ప్రభుత్వం తరపున అధికారిక లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు జానకిరామ్ సమాధి ప్రక్కనే హరికృష్ణ అంత్యక్రియలు రేపు జరగనున్నాయని తెలుస్తోంది.
