రోడ్డు ప్రమాదంలో నటుడు, మాజీఎంపీ నందమూరి హరికృష్ణ మృతి చెందారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా హరికృష్ణ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. మంచినీరు తాగుతుండగా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో హరికృష్ణ బయటకు పడిపోయారు. గతంలో ఇదే జిల్లాలో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.
