Home / Tag Archives: nalgonda

Tag Archives: nalgonda

రేపు వాసాలమర్రికి ముఖ్యమంత్రి కేసీఆర్‌

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మరో 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు గ్రామాన్ని సందర్శించనున్నారు. ఇంతకు ముందు జూలై 9న గ్రామ పర్యటనకు సిద్ధమైనా.. వాయిదా పడింది. సీఎం గ్రామంలోని దళితవాడలో పర్యటించడంతోపాటు రైతువేదికలో …

Read More »

షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ట్విస్ట్

తెలంగాణలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వైఎస్ షర్మిల పర్యటించారు. బంగారుగడ్డలో ఎండీ సలీం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం హుజూర్‌నగర్‌లో పర్యటించారు. అయితే షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మేడారం గ్రామంలో ఇంటికి తాళం వేసి నీలకంఠ సాయి కుటుంబం బయటకు వెళ్లిపోయింది. షర్మిల వస్తున్నారని.. కావాలనే నీలకంఠ కుటుంబాన్ని టీఆర్ఎస్ నేతలు తరలించారని వైఎస్సార్‌టీపీ నేత పిట్టా రాం రెడ్డి ఆరోపించారు. తాళం వేసిన నీలకంఠ …

Read More »

సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన

తెలంగాణలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌ నుంచి ఆయన బయల్దేరి 3 గంటల వరకు సూర్యాపేటకు చేరుకొని కోర్టు కూడలిలో ఏర్పాటు చేసిన కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటల 45 నిమిషాలకు నల్లగొండ జిల్లాలోని …

Read More »

రేపు యాదాద్రికి ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ రేపు యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ.. రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, సీఎం కేసీఆర్‌ కూడా యాదాద్రికి వెళ్తారు. యాదాద్రీశుని దేవాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పునఃనిర్మిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్‌ ఎన్వీ రమణ నిన్న …

Read More »

ప్రజారోగ్యపరిరక్షణ లో తెలంగాణ టాప్

ప్రజారోగ్య పరిరక్షణ లో తెలంగాణా ప్రభుత్వం సత్ఫాలితలు సాధిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడమే అందుకు కారణమని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన మెడీకల్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని బుధవారం రోజున ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

సూర్యాపేటలో ఫిక్లర్ ట్రీట్ మెంట్ ప్లాంట్

సూర్యాపేటలో ఎఫ్.ఎస్. టి.పి(ఫికల్ సర్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) నిర్మాణం చేపట్టబోతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. అందుకు అవసరమైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని మున్సిపాలిటికి బదలాయించాలని ఆయన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ని ఆదేశించారు.ఈ మేరకు శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి ఇమాంపేట లో స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ లతో …

Read More »

అద్భుతంగా యాదాద్రి

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత మహాద్భుతంగా, సువిశాలమైన స్థలంలో శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ నగరిలో ఒక్కో కట్టడానికి ఒక్కో కొలతలు వేసి అందంగా, భక్తులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి కొండపై శిల్ప కళాసౌరభంగా రూపుదిద్దుకుంటున్న పంచనారసింహ క్షేత్రం నిర్మాణాలను 17.32 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇందులో 4.30 ఎకరాల్లో ప్రధానాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాఢవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల రాజగోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిప్టు నిర్మించగా, పనులు …

Read More »

హద్దుమీరితే తొక్కేస్తాం

మేం తలచుకుంటే దుమ్ముదుమ్మైపోతరు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణను అరిగోస పెట్టిన లఫంగిపార్టీ.. దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెస్‌ అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు అధికా రం ఇచ్చారని.. ఏ ఢిల్లీవోడో నామినేట్‌ చేస్తేనో. ఇంకెవడో ఇస్తేనో రాలేదని పేర్కొన్నారు. ఏండ్లు గా తెలంగాణ ఈ దుస్థితికి రావడానికి కారణమైన కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హతే లేదని చెప్పారు. రాష్ర్టానికి అన్యాయం …

Read More »

పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి  తిరిగి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ప్రకటించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగే అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలని సీఎం సూచించారు. …

Read More »

మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన అంశాల స్వామి.. నెర‌వేర‌నున్న సొంతింటి క‌ల

నల్ల‌గొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్ర‌వారం మంత్రి కేటీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిశారు. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (సెలూన్) ని మంత్రి ఏర్పాటు చేయించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అంశాల స్వామికి ఒక పక్కా ఇల్లు నిర్మించి అందించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం త‌ర‌పున‌ అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా …

Read More »