నందమూరి హరికృష్ణ మరణించడంతో చాలామంది అభిమానులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు సన్నిహితులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు. ముఖ్యంగా అన్న చనిపోవడంతో బాలకృష్ణ అన్నీ తానే చూసుకుంటూ హరికృష్ణ అంత్యక్రియలలో పాల్గొని హరికృష్ణ ఇద్దరు కుమారులైన కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ని ఓదార్చడం జరిగింది.
ఈ సందర్భంలో నందమూరి అభిమానులకు కొంత ఊరట కలిగింది. ఎందుకంటే గతంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య వివాదాలు ఉన్నట్టు…అందుకే రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రారంభోత్సవానికి పిలవలేదు అని సమాచారం.
అయితే తండ్రి మరణంతో భాదపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ ఇటీవల పలకరించడం జరిగింది. భోజన సమయంలో బాలకృష్ణ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో మాట్లాడుతూ మీకు అండగా నేనున్నాను బాధపడకండి అంటూ ధైర్యాన్ని ఇచ్చారు.ఈ వీడియో కుడా బయటకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ వీడియో చూసిన అభిమానులు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ముగ్గురు ఎల్లప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నారు.