చంద్రబాబునాయుడుకు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సవాలు విసిరారు. రూ. 1.30 లక్షల కోట్లను రాష్ట్రంలో దేనికి ఖర్చు చేశారో చెప్పగలరా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వేరు వ్యాపారం వేరని చెప్పిన చంద్రబాబు మాత్రం ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నారట. చంద్రబాబు నిజాలు చెప్పి ఏరోజైన పరిపాలన చేసాడా అంటూ విమర్శించాడు. ఎందుకంటే, చంద్రబాబు గురించి ఉండవల్లికి కొత్తగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు.
చంద్రబాబు చేస్తున్న వ్యాపారాన్ని స్విట్జర్లాండ్ ఆర్దిక వేత్తలు కూడా వ్యతిరేకిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రభుత్వం ప్రతీ వారం చేస్తున్న ఖర్చులను బయటపెట్టాలంటూ ఉండవల్లి డిమాండ్ చేశారు. అవినీతి చేసి డబ్బులివ్వాల్సొస్తోందన్న విషయాన్ని నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబే ఒప్పుకున్నట్లు ఉండవల్లి చెప్పారు.
ఉండవల్లి ఎప్పుడూ రాజకీయాలు, ప్రాజెక్టులపైనే మాట్లాడేవారు అయితే తాజాగా మద్యం వ్యాపారంపైన కూడా మాట్లాడారు. రూ. 8.50కి తయారయ్యే మద్యాన్ని ప్రభుత్వం రూ. 50కి అమ్ముకుంటు 37 రూపాయల లాభం సంపాదిస్తోందన్నారు.అమరావతి బాండ్ల జారీపైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ట్యాక్స్ ఎంతో తెలీకుండానే బాండ్లు ఎలా జారీ చేస్తారంటూ నిలదీశారు.