టీఆర్ఎస్ పార్టీ నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే.అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని..తెలంగాణ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్నసిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ నిరాకరించామన్నారు. రేపు జరగనున్న హుస్నాబాద్ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుడతామని స్పష్తం చేశారు. అనేక త్యాగాల, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని, పలు రాష్ర్టాల సీఎంలు ప్రశంసించారన్నారు.. అయితే రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రధానమైన నియోజక వర్గాల్లో కొడంగల్ ఒకటి. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి పట్టున్న నియోజకవర్గం ఇది. టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో రేవంత్‌కు మంచి పట్టు ఉంది. గతేడాది టీడీపీని వీడిన రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. అప్పటి నుంచే అధికార టీఆర్ఎస్ ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టి రేవంత్‌ను ఎదుర్కొనేందుకు అన్ని సిద్దం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్‌ను ఓడించాలనే సంకల్పంతో ధీటైన అభ్యర్థి కోసం అన్వేషించిన కేసీఆర్ చివరకు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ టిక్కెట్‌ను కేటాయించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్.. రేవంత్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తుంది. అంతేకాదు అక్కడ తమ విజయాన్ని ఎవరూ ఆపలేరనే ధీమాతో ఉంది.అయితే ఇప్పటికే నరేందర్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గంలో పాగా వేసి మంచి పట్టు సాధించుకున్నారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుమతిగా ఇచ్చి..కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి దిమ్మతిరిగే లా వ్యూహాలు రచిస్తున్నారు.అయితే రేవంత్ గత నాలుగు సంవత్సరాల నుంచి కోడంగల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం..ఈ క్రమంలోనే రేవంత్ పై నియోజకవర్గంలోని ప్రజలు తీవ్ర వ్యతిరేకత తో ఉన్నారు.ఈ సారి టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి కే తమ ఓటు అంటూ స్పష్టం చేస్తున్నారు.
