Home / 18+ / పక్కా ఆధారాలతో అరెస్టు చేసాం…….డీసీపీ సుమతి

పక్కా ఆధారాలతో అరెస్టు చేసాం…….డీసీపీ సుమతి

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.పక్కా సాక్ష్యాధారాలతోనే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నార్త్‌-జోన్‌ డీసీపీ సుమతి మీడియాకు వివరించారు.ఆధార్ డేటా ఆధారంగా కేసు సులువుగా టేకాఫ్ చేశామని ఇప్పటి వరకు జగ్గారెడ్డి భార్యా పిల్లలకు పాస్ పోర్టులే లేవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. జగ్గారెడ్డిపై ఐపీసీ 419,490,467,468,471,370, పాస్ పోర్టు యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద మొత్తం 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించారు. మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా 14రోజుల పాటు రిమాండు విధించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో దర్యాప్తు చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులపేర్లతో నకిలీ పాస్‌-పోర్టుతో అమెరికా వెళ్లినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

కుటుంబ సభ్యుల పేర్ల పైన వేరే వారిని ఆయన తీసుకువెళ్లినందుకు మనుషుల అక్రమ రవాణా కేసు నమోదు చేసినట్లు ఆమె వివరించారు. జగ్గారెడ్డి అమెరికా తీసు కెళ్ళినవారు ప్రస్తుతం అక్కడే వున్నారని, వారిని అక్కడికి తీసుకెళ్లేందుకు మనిషికి ₹ 5 లక్షల చొప్పున మొత్తం ₹15 లక్షలను ఏజెంట్‌ నుండి లంచం తీసుకున్నట్లు తేలిందని తెలిపారు.

2004లో ఎమ్మెల్యేగా వున్న సమయంలోనే ఈ చర్యకు పాల్పడ్డారని, జగ్గారెడ్డిని అరెస్టు చేసి ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులు, ఫ్యామిలీ ఫొటోలను స్వాధీనం చేసు కున్నామని వివరించారు.