261వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం బీచ్‌రోడ్‌లోని లాసెన్స్‌బే కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్, టీటీడీ ఫంక్షన్ హాలు, ఎంవీపీ కాలనీ, ఎంవీపీ డబల్ రోడ్డు, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ జంక్షన్, హనుమంతవాక జంక్షన్, ఆరిలోవ జంక్షన్ మీదుగా చినగదిలి వరకు సాగుతుంది.సాగర తీరానికి ఎగసిపడే అలలతో పోటీగా జననేత అడుగులో అడుగు వేసేందుకు జనకెరటాలు ఎగసి పడ్డాయి. అలల హోరుకు జనహోరు తోడైంది.
బారులు తీరిన అభిమానులతో వాల్తేరురోడ్లు కిక్కిరిసిపోయాయి.అడుగడుగునా స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజ కవర్గ పరిధిలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో చినగదిలి వద్ద బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సు జరుగుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం చెప్పారు. ఈ సదస్సులోపెద్ద సంఖ్యలో ముస్లిం సామా జికవర్గానికి చెందిన పెద్దలు, ప్రముఖు లు, ప్రతినిధులు పాల్గొనాలని ఆయన కోరారు.
చినగదిలి నుంచి ఆరిలోవకు వెళ్లే దారిలో క్యూ–1 ఆస్పత్రి పక్కన జరుగనున్న ఈ ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు.ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.