ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో తెలంగాణలో టీడీపీ పరిస్థితి కూడా అంతే…..ఓమాదిరిగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది.అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని చంద్రబాబు గెలవడం కోసం ఏ పార్టీతో ఐన పొత్తు పెట్టుకోవడం అలవాటని వివరించారు.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్టుతో టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదు. గతంలో నమోదైన కేసు విచారణలో భాగంగానే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు’అని తెలిపారు.ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొడతామని ధీమా వ్యక్తం చేశారు.
అసెంబ్లీ టికెట్ల విషయంలో కొన్నిప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయని.. పార్టీ నాయకత్వం వాటిని త్వరలోనే పరిష్కరిస్తుందని వెల్లడించారు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిలు స్వార్థం కోసం మాపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.