ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా వ్యాజ్యాన్ని హైకోర్టు స్వీకరించడం విశేష పరిణానమే. బాబు, లోకేష్ 25 వేల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారని…వారిపై సిబిఐ, ఈడి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రిటైర్డు న్యాయాధికారి, ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షులు జె.శ్రవణ్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు వేమూరి రవి కుమార్ లు డొల్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చారని, వాటి ద్వారా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని ఈ పిల్ లో పేర్కొన్నారు.
ఉద్యోగ కల్పన పేరుతో నారా లోకేష్, వేమూరి రవికుమార్‌లు నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని…చంద్రబాబు, లోకేష్‌ల తరఫున రవికుమారే మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ అవినీతిపై సీబీఐ, ఈడీ దర్యాప్తులకు ఆదేశించాలంటూ శ్రావణ్ కుమార్ పిల్‌లో హైకోర్టును కోరారు. ఇందులో నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్, ఐటీ శాఖ మాజీ మంత్రి పల్లె రఘునాఎద్‌రెడ్డి, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) సీఈఓ వేమూరి రవికుమార్ లను వ్యక్తిగత ప్రతివాదుల్ని చేశారు.