టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. గురు, శుక్రవారాల్లో సైతం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీ లో చేరారు. సిద్దిపేట రూరల్ జిల్లా సీతారాంపల్లి కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు వనం భానుప్రకాశ్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రవీణ్, సీపీఎం మండల అధ్యక్షుడు పడిగే ప్ర శాంత్ తదితరులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీ ఆర్‌ఎస్‌లో చేరారు.
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెం దిన 30మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అర్వపల్లి మండలం తిమ్మాపురానికి చెందిన పలువురు విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నిర్మల్ పట్టణంలోని రాంనగర్, ఈదిగాం, షేక్‌సౌపేట్ తదితర కాలనీలకు చెందిన మైనార్టీ యువకులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో, వనపర్తి జిల్లా పె బ్బేరు మండలం అంకూర్ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, అయ్యవారిపల్లికి చెందిన రవిసాగర్ ఆధ్వర్యం లో పలువురు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.