2019 లో రాప్తాడులో గెలవడం కష్టంగా ఉందని అయినా తాను పోటీకి సిద్ధమని అయితే కుమారుడు పరిటాల శ్రీరామ్ కు ధర్మవరం లేదా పెనుగొండ ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మంత్రి సునీత ముఖ్యమంత్రి గారిని కోరింది.
అందుకు ఆయన రెండు సీట్లలో పోటీ చేస్తే ఇద్దరూ ఓడిపోతారు కనుక నువ్వే రాప్తాడు నుండి పోటీ చేయాలి. రాప్తాడు లో మీరు చాలా వెనుకబడి ఉన్నారు నియోజకవర్గంలో బలం పుంజుకునే ప్రయత్నం చేయండి అని చెప్పారు, దీంతో చేసేదేమీ లేక సునీత కనీసం హిందూపురం పార్లమెంట్ నుండి అయినా నా కుమారునికి అవకాశం ఇవ్వాలని కోరింది .
అందుకు నిరాకరిస్తూ చంద్రబాబు గారు నీ కుమారుడి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది హత్య, హత్యాయత్నం వంటి అనేక కేసుల్లో ఆయన ముద్దాయి కావాల్సింది ,కేసుల నుండి తప్పించడంతో ఇప్పటికే ప్రభుత్వంపై పోలీసులపై ప్రజల్లో నమ్మకం పోయింది ఇక అతన్ని పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే జిల్లాలో చదువుకున్న వారెవ్వరు మన పార్టీకి ఓటు వేయరు అని చెప్పారట.అంతేకాకుండా కొంతమంది వైకాపా నాయకులతో కలసి ఆయన చేస్తున్న వ్యాపారాలపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.దీంతో సమీప భవిష్యత్తు లో పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఎదిగే అవకాశం లేదని తెలుస్తోంది