ఏపీలో తాజా సర్వే ఆసక్తి రేపుతోంది.ఇప్పటికే ఎన్నో సర్వేలు వచ్చిన తాజాగా వచ్చిన సర్వే ఏపీలో సంచలనం రేపుతుంది. ఈ సర్వే ఫలితాలు పూర్తిగా వైసీపీని ఆకాశానికెత్తేశాలా ఉండటం విశేషం.ఇటీవలే జాతీయ మీడియా జరిపిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని తేలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన సర్వేలో మాత్రం వైసీపీ ఏకంగా ఈసారి 125 నుంచి 150 సీట్లు వస్తాయని రిపోర్ట్ లో పేర్కొనడం విశేషం. ఇలా ఫలితాలు రావాడానికి కారణాలు కూడ తెలిపింది సర్వే. రాష్ట్రంలో ప్రజలు టీడీపీ పాలనపై సంతృప్తితో ఉన్నారో, లేదో కూడా సర్వే చెప్పింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, రేషన్ సరుకుల పంపిణీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సర్వేలో తెలిసింది. అంతేకాదు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపలేకపోయినందున యువత అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మరికొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. మొత్తంగా 70% ప్రజలు టీడీపీ పాలన బాగలేదన్నారంట. 15% పర్వాలేదు అన్నారంట. 15% టీడీపీ పాలన బాగుంది అంటున్నారంట. దీంతో 2019లో అత్యధిక సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందని సర్వే ప్రకటించింది. ఇంతకముందే జాతీయ మీడియా రిపబ్లిక్ టీవీ జరిపిన సర్వేలో 13 సీట్లకు పైగా పార్లమెంట్ స్థానాలను వైసీపీ గెలుచుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
