పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుల రాజకీయం చేస్తున్నారట.. ఎమ్మెల్యే వేటుకూరి
వెంకట శివ రామరాజు కుల రాజకీయం చేస్తున్నారనేది ప్రధాన విమర్శ.. ముఖ్యంగా శివ రామరాజు బీసీలను అణగదొక్కుతున్నారని, దీనిని అరికట్టాలంటే బీసీలు ఏకమవ్వాలని నిర్ణయించుకున్నారట.. తాజాగా గౌడసంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కట్టా గంగాధరరావు ఇంట్లోరహస్య సమావేశాలు ఏర్పాటు చేసారట.. తెలుగుదేశం నుండి బయటకు వచ్చే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది.. టీడీపీ మండల అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాసరావు గత ఆరునెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట.. అయినా పార్టీకోసం పనిచేసిన వారిని శివరామరాజు పట్టించుకోకపోవడం లేదట.. దీంతో విసిగిపోయిన పార్టీ నాయకులు రాజీనామా చేసే ఆలోచనకు వచ్చేసారట.. ఏళ్ల తరబడి పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు వంటి పార్టీ నాయకులు గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రేయి, పగలు కష్టపడి కార్యకర్తలను ఒకే తాటి మీద నడిపించి పార్టీని ముందుకు నడపడంలో కీలక పాత్ర పోషించారు.
2014 పంచాయితీ ఎన్నికల్లో మేజర్ పంచాయితీ మహాదేవపట్నంను గ్రామ పంచాయితీ సర్పంచ్ గా గెలిపించారు.. ఇలా పార్టీకి అన్నివిధాలుగా సేవ చేసిన శ్రీనివాసరావు ఈరోజు శివ విధానాలతో పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందట.. రావడానికి కారణాలు పలువురు అనేక రకాలుగా అనుకోవడం గమనార్హం. ఎప్పటికీ ఎమ్మెల్యే శివరామరాజు శ్రీనుతో మాట్లాడపోవడం తో గౌడ, శెట్టిబలిజ సంఘాల నుండి తీవ్ర అసంతృప్తి ఏర్పడుతుందని కొంతమంది నాయకులు శ్రీను ని పిలిచి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా శ్రీను తిరస్కరించారట.. శ్రీను మరికొద్ది రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. శ్రీను వంటి నాయకుడిని తమ పార్టీలోకి తీసుకెళ్లేందుకు విపక్ష వైసీపీ ప్రయత్నిస్తోంది.. శ్రీను వర్గం టీడీపీకి రాజీనామా చేస్తే తమ పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తామని చెప్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే శివరామరాజు వైఖరితో తెలుగుదేశం పార్టీకోసం పనిచేసే ఎంతోమంది దూరమవుతున్నారని పార్టీ సీనియర్లు ఆగ్రహిస్తున్నారు. మరోవైపు పీవీఎల్ శిబిరం టీడీపీ అసమ్మతి ద్వితీయ శ్రేణి న్యాయకత్వానికి గాలం వేస్తుంది.