టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ మరోమారు జాతీయ స్థాయిలో వార్తాంశంగా నిలిచారు. మంచి వాక్చాతుర్యం, జాతీయ స్థాయి నేతలతో పరిచయాలు కలిగి ఉన్న కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిన సంగతే. అలా ఆయన చురుగ్గా స్పందించడం వల్ల జమ్ముకశ్మీర్ నుంచి ఆహ్వానం అందింది. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఏకంగా తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు.
Wow! Didn't realise even casual, friendly banter can get prominent media attention ? https://t.co/4BUIiAU9vu
— KTR (@KTRTRS) January 17, 2019
ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో విపరీతంగా మంచుకురుస్తుండటంతో…పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న తన ఇల్లు ఫోటోను జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో చూసిన కేటీఆర్ `చాలా అందంగా ఉంది…నాకు అలాంటి ప్రాంతంలో ఇల్లు ఉంటే బాగుండేది` అని ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ కి స్పందించిన ఒమర్ “మా ఇంటిని మీ ఇల్లే అనుకోండి. ఇక్కడకు వచ్చి మీకు నచ్చినన్ని రోజులు ఉండొచ్చు“ అని రిప్లై ఇచ్చారు. దీనిపై మళ్లీ కేటీఆర్ వెంటనే స్పందించారు. “మీ కామెంట్స్ ని నేను సీరియస్‌గా తీసుకుంటాను` అంటూ కేటీఆర్ సరదాగా ట్వీట్ చేశారు. వీరిద్దరి ట్వీట్ల సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది.
ట్విట్టర్ వేదికగా ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంబాషణను ఓ జాతీయ ఛానల్ హైలెట్ చేసింది. దీంతో దీనికి కేటీఆర్ స్పందించారు. ఆత్మీయ సంభాషణ కూడా మీడియా దృష్టిని ఆకర్షిస్తుందా? అంటూ సెటైర్ వేశారు. కాగా ఇద్దరు యువనేతల మధ్య సాగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంది.