జరిపారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డితో హైదరాబాద్‌లో భేటీ అయిన కీలకమైన ఫెడరల్ ప్రంట్ గురించి చర్చించిన సంగతి తెలిసిందే.జగన్ నివాసమైన లోటస్‌పాండ్ వేదికగా, తెలంగాణలో అధికార పక్షమైన టీఆర్‌ఎస్ నేతలు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పక్షమైన వైసీపీ నాయకులతో సంప్రదింపులు, సమాలోచనలు జరిపారు. అయితే, ఈ భేటీపై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అంతా ఊహించినట్లుగానే, లోకేష్ మీడియాతో మాట్లాడకుండా…ట్విట్టర్‌లో తన స్పందన వినిపించారు.
ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ, తెలంగాణ మోడీ ఒక్కటయ్యారు. ఇంత కాలం వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం, ఇప్పుడు బహిర్గతం అయ్యింది!
— Lokesh Nara (@naralokesh) January 16, 2019
‘ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ, తెలంగాణ మోడీ ఒక్కటయ్యారు. ఇంతకాలం వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతమైంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటా దక్కకుండా అడ్డుపడుతున్న కేసీఆర్‌తో కలిసి జగన్ ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్ ఏర్పాటు చేశారు’ అని ఆయన ఆరోపించారు. వైఎస్సార్ సీపీ చీఫ్ జగన్ , టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశాన్ని పేర్కొంటూ ముగ్గురు మోడీలు ఒక్కటయ్యారని ట్విటర్‌లో విమర్శించారు.
అయితే, నిజంగా లోకేష్‌కు విమర్శించే అంత దమ్ముంటే…ఆయన మీడియా ముందుకు వచ్చేవారని అలా కాకుండా ట్విట్టర్ ఓ ట్వీట్ పడేయటంతోనే…లోకేష్ భాషా పాండిత్యం అర్థమవుతోందని పలువురు సెటైర్లు వేస్తున్నారు.