సంప్రదాయం,సంస్కారం…విలువలు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే తెలుగుదేశం పార్టీ నేతల నిజస్వరూపం ఏంటో మరోమారు బయటపడింది. బహిరంగంగా అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఆ వ్యక్తి అల్లాటప్పా నాయకుడేం కాదు…సాక్షాత్తు ఏపీ మంత్రి. ఆయనే అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో ఓటర్లపై బెదిరింపులకు దిగారు. నోరు పారేసుకున్నారు.
ప్రభుత్వం ద్వారా అందే అన్నీ దొబ్బి ఓటెయ్యకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏం రా..వంద యూనిట్లు ఫ్రీగా తీసుకొని ..మీ ఆవిడ పది వేలు దొబ్బంది.. రుణమాఫీ వస్తే దొబ్బారు.. ఇవన్నీ దొబ్బి మనకు ఓట్లేయకపోతే నిలదీయండి` అంటూ మంత్రి తన అనుచరుల దగ్గర విప్పిన బూతు పురాణం వీడియో బయటకు వచ్చింది. ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. మంత్రి బూతు పురాణం విని కొంతమంది పగులబడి నవ్వగా.. తన సొంత ఇంట్లోని డబ్బులను మంత్రి ఏమైనా ఇచ్చారా అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొబ్బితినటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ అనేది ప్రభుత్వం ఇచ్చిన హామీ.. అది కూడా దొబ్బితిన్నారు అంటున్నారంటే.. టీడీపీ నేతలకు ప్రజలు అంటే ఎంత గౌరవం అని నిలదీస్తున్నారు. మహిళలపై మంత్రిగారికి ఎంత గౌరవం ఉందని ప్రశ్నిస్తున్నారు. దొబ్బితినటానికి ఫ్రీ ఇవ్వలేదని.. సంక్షేమం అంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలే కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్లు కలకలం రేపుతున్నాయి. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు గౌరవనీయంగా ఉండాల్సిన మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్లు చూస్తుంటే.. ఎంత అహంకారం అంటూ తిట్టిపోస్తున్నారు మరికొందరు. ఎవరు డబ్బులు ఇవ్వమన్నారు అంటూ కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు.