దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా హిట్ టాక్ సొతం చేసుకుంది. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన ‘పాదయాత్ర’ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయారు.. సినిమా మొత్తాన్నిఎమోషన్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించారు.. ఆయా సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో వైయస్ ఎలా వ్యవహరించేవారనేది చూపించారు.
ప్రజల తరపున అధిష్టానంతో ఎలా మాట్లాడేవారు.. వైఎస్ మాట ఇస్తే ఎవరినైనా ధిక్కరించే నైజాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు. అయితే సినిమా ఆద్యంతం గత పదిహేనేళ్ల పాలనలో రైతులు, విద్యార్ధులు, మహిళలు, పేదలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇప్పుడు కూడా అవే పరిస్థితులు ఉండడంతో ప్రస్తుతం తెలుగుతమ్ముళ్లు ఉలిక్కి పడుతున్నారు. ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర ద్వారా జగన్ నడవడం, అప్పుడు రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర చేయడం ఇద్దరూ చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనపైనే పాదయాత్ర చేయడంతో హిస్టరీ రిపీట్ అవుతుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలు వెలువడుతున్నాయి. అచ్చం వైఎస్ మాదిరిగానే జగన్ కూడా ప్రజల్లో నిలబడి వారి కష్టాలు విని అందుకు తగ్గట్టుగా హామీలివ్వడం ఇక్కడ ప్రధానంశంగా మారింది.