మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా తెలుగుప్రజలను మెప్పిస్తోంది. వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన పాదయాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొత్తాన్నిఎమోషన్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించారు.. ఆయా సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో వైయస్ ఎలా వ్యవహరించేవారనేది చూపించారు. ప్రజల తరపున అధిష్టానంతో ఎలా మాట్లాడేవారు.. వైఎస్ మాట ఇస్తే ఎవరినైనా ధిక్కరించే నైజాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు.
అయితే ఈ సినిమాలో రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వం గురించి ఎంతో హత్తుకునే సంఘటనలు కనిపించాయి. అయితే రాజశేఖరరెడ్డికి సంబంధించి కొందరు వ్యక్తులు పలికిన పేర్లు, వారితో వైఎస్ కు ఉన్న సంబంధాన్ని బట్టి ఆయనను పిలిచిన విధానం ఎంతో కొత్తగా ఉంది.. కేవీపీ రామచంద్రారావు వైఎస్ ను “రాజా” అని పిలవడం, టీడీపీ నాయకుడు “రాజశేఖరా” అని, హైకమాండ్ “రెడ్డి”, “రెడ్డిసాబ్” అని, పులివెందులలో “అన్నా” అని అంటారని చాలామందికి ఇప్పుడే తెలుసు.. అందరికీ వైఎస్, వైఎస్సార్ అని మాత్రమే ఇప్పటివరకూ తెలుసు.