Home / 18+ / బాలకృష్ణ నటించడం వల్లే ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయ్యిందా.. యాత్రకు ప్లస్సేంటి.?

బాలకృష్ణ నటించడం వల్లే ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయ్యిందా.. యాత్రకు ప్లస్సేంటి.?

దివంగత మహా నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా యాత్ర కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌సూలు చేసింది. రెండో రోజు కూడా రెండున్న‌ర కోట్ల‌కు పైగా గ్రాస్.. కోటిన్న‌ర వ‌ర‌కు షేర్ తీసుకొచ్చాయి. ఈ మూడు రోజుల‌కు కానీ రూ.5 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తుంది. మ‌రో రెండు వారాల వ‌ర‌కు సినిమాలే లేక‌పోవ‌డం కూడా యాత్ర‌కు క‌లిసి రానుంది. సినిమాలో మ‌మ్ముట్టి న‌ట‌న‌ మ‌హి టేకింగ్ కధనం అద్భుతంగా కుదిరాయి. అన్నీ యాత్ర సినిమాకు క‌లిసొస్తున్నాయి.

వైసీపీ కూడా ఈ సినిమా పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. యాత్ర సినిమా, ఎన్టీఆర్ సినిమాలు రాజకీయ పరంగా వైసీపీ టీడీపీపరంగా పోటీగా వచ్చాయి. యాత్ర సూపర్ హిట్ కావడంతో స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా తీసిన ఎన్టీఆర్ కథానాయుకుడు అంతగా మెప్పించలేకపోవడంతో ఈ సినిమా హీరో, నిర్మాత తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. క‌థానాయ‌కుడు అంచ‌నాలు అందుకోలేక‌పోవడం.. యాత్ర మాత్రం అద్భుతం చేస్తుండటంతో బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారట.. ముఖ్యంగా ఎన్టీఆర్ గొప్పవ్యక్తే అయినా ఆ పాత్ర బాలయ్య చేయడం సినిమాకు మైనస్ గా మారిందని అదే మమ్ముట్టి నటించడం యాత్ర సినిమాకు ఎంతో ప్లస్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి.

                                         

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat