మాజీ మంత్రి , సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏపీలోని రాజమండ్రిలో అపూర్వ స్వాగతం లభించింది.తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు ఓ వివాహానికి హాజరయ్యేందుకు రాజమండ్రి వెళ్లారు.ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో అక్కడి యాదవ సంఘం నాయకులు, అభిమానులు ఆయన్ని ఘనంగా స్వాగతించారు. తలసానితో ఫోటోలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఏపీ ప్రజలు పోటీపడ్డారు. ఆ తర్వాత యాదవ సంఘం ఆధ్వర్యంలో పెళ్లి వేదిక వరకు ర్యాలీగా తలసానిని తీసుకెళ్లారు. దారిపొడవునా..జై తలసాని నినాదాలతో అభిమానులు హోరెత్తించారు.
జై తలసాని నినాదాలతో మారుమోగిన ఎయిర్ పోర్ట్.
రాజమండ్రి ఎయిర్ పోర్టులో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఘన స్వాగతం. జై తలసాని నినాదాలతో మారుమోగిన ఎయిర్ పోర్ట్.
Posted by Talasani Srinivas Yadav on Wednesday, 13 February 2019