టాలీవుడ్ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. ఇటీవల ఓ డిజాస్టర్ అందుకున్న ఒక మాస్ స్టార్ డైరక్టర్ ఘన కార్యాలు వెలుగుచూసాయి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే ఒక చిన్న హీరోయిన్ తో అతనికున్న సత్సంబంధాలు అనుమానం రేకెత్తిస్తున్నాయి. టాలీవుడ్ లో దీనిపై పెద్ద రచ్చే నడుస్తోంది. కొద్ది నెలలక్రితం ఓ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ వేరే దేశానికి వెళ్లాల్సివచ్చింది. ఈ నేపధ్యంలో సదరు దర్శకుడు సినిమా ప్రొడ్యూసర్ తో అత్యంత ఖరీదైన హోటల్ లో సుమారుగా కోటి రూపాయలు వెచ్చించి ఓ ఫ్యామిలీతో పాటు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు అకామిడేషన్ ఏర్పాటు చేయించారట.. వాస్తవానికి అదే షూటింగ్ కు అసలు వేరే దేశం వెళ్లాల్సిన పనే లేదట.. హైదరాబాద్ లోనే ఆ షూటింగ్ ఈజీగా చేసుకోవచ్చట.
అయితే కేవలం ఈ ఆర్టిస్ట్ కోసమే దర్శకుడు అంత దూరం తీసుకెళ్లారట.. ఇదంతా ఆ ప్రొడ్యూసర్ కు తిరిగి హైదరాబాద్ వచ్చాక తెలిసిందట.. దీంతో ఆ డైరక్టర్ పై ప్రొడ్యూసర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దర్శకుడు ఎంతో నిబద్ధతో పనిచేసే వ్యక్తిగా బిల్డప్ ఇవ్వడం, ఓ అగ్ర దర్శకుడి సినిమాలోనూ మహిళల గురించి వీర లెవెల్ లో డైలాగులు చెప్పడంతో ఈయనగారి ఘన కార్యాలు తెలిసిన సినీ పెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే ఈయన కేవలం ఒకే మూస ధోరణిలో సినిమాలు తీస్తాడే తప్ప ఎటువంటి కొత్తదనం చూపించలేరనే విమర్శలూ ఉన్నాయి. అయితే తాజాగా వచ్చిన ఈ వివాదం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.