ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రతిపక్షంలో వైసీపీ పార్టీలోకా భారీగా చేరికలు జరుగుతున్నాయి.నిన్నటికి నిన్న ప్రకాశిం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ పార్టీలో చేరగా నేడు మరికొందరు జగన్ తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరు టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. నిన్నటి నుంచి వారి ఫోన్లు కూడా అందుబాటులోకి రావడంలేదు. వారి భాటలోనే మరో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ హయాంలో ఓ వెలుగువెలిగిన మాజీ మంత్రి కూడా నేడో.. రేపో వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్… ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని లోటస్ పాండ్లో కలవనున్నారు. అయితే ఈ ఎంపీతో పాటు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 24వ తేదీన విశాఖలో వైసీపీ సమర శంఖారావం కార్యక్రమం వేదికగా వైసీపీలో అధికారికంగా చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, రాజీనామా చేసి రావాలనే కండీషన్ కూడా వైఎస్ జగన్ కండీషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నంలోగా ఆయన రాజీనామా చేసి… వైసీపీలో చేరనున్నారు. అవంతితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వారం రోజుల్లో వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది.
