ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది వలసలు జోరందుకున్నాయి.అయితే ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు,ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత వరం రోజులనుంచి చూస్తే.. మొన్న మేడా మల్లికార్జున రెడ్డి ఆ తరువాత ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నిన్నటికి నిన్న అవంతి శ్రీనివాస్ , దాసరి జై రమేష్.. ఈ విధంగా అధికార పార్టీ నేతలంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయి.. జగన్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. అయితే గత నాలుగేల్లనుంచి ఎన్నడూ లేనిది ఇంత త్వరగా రోజుకో నాయకుడు ఎందుకు వైసీపీలోకి చేరుతున్నారని అరా తీస్తే ..దీనికి బలమైన కారణం ఉందట.
అదే జగన్ మోహన్ రెడ్డి పెట్టిన డెడ్ లైన్..ఏ పార్టీకైనా ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు తప్పదు.అయితే దీన్ని గమనించిన జగన్ మోహన్ రెడ్డి ఏపీలోని నాయకులకు ఒక డేడ్ లైన్ విధించారట. ఈ నెల 20 లోపు ఎవరైనా వచ్చేవారుంటే రావచ్చని ఆల్టిమేటమ్ జారీ చేశారట. ఈ నెల 20 లోపు వచ్చేవారికే సీట్ల కేటాయింపునకు సంబంధంచి హామీ ఉంటుందని.. లేదంటే తర్వాత వచ్చేవారు పార్టీలో చేరినా.. సీట్లు వచ్చే అవకాశాలు మాత్రం కష్టమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట.ఈ సందర్భంగా కీలక నేతలందరు..జగన్ తో భేటీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఈ నెల 20 లోపు మరో 15 మంది టీడీపీ నుంచి కీలకమైన నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని రాజకీయ వర్గాలంటున్నాయి.