ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయత్ర ముగియాగానే అధికార టీడీపీ నుండి, ఇతర పార్టీల నుండి భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటంతో చంద్రబాబుకు ఏం జరుగుతుందో అర్థం కావాడం లేదంట. ఎవరు ఎప్పుడు వైసీపీలోకి చేరుతారో టెంక్షన్ మొదలైయ్యిందంట. ఇప్పటికే కీలకమైన కడప జిల్లాలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరగా.. మొన్న ప్రకాశంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి… నిన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరిపోయారు. అయితే మరి కొందరు ఇదే బాటలో నడవనున్నారని తెలుస్తోంది. అయితే వీరి తరువాత ఎవరు అనే అంశం గురించి ఆసక్తిదాయకమైన చర్చ జరుగుతూ ఉంది. ప్రత్యేకించి కోస్తాంధ్ర నుంచి తదుపరి చేరికలు ఉండబోతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో వినిపిస్తున్న పేర్లు.. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి. వీళ్లిద్దరూ వైసీపీలో చేరడం గురించి ముందు నుంచినే ఊహాగానాలున్నాయి. ఇప్పుడు అవే నిజం కాబోతున్నాయని సమాచారం. మోదుగల వైసీపీ లోకి చేరడం లాంఛనమే అని వార్తలు వస్తున్నాయి. చూడలి మరి ఇంకా ఎన్నికల సమయానికి ఎంతమంది వైసీపీలో చేరుతారో..!
