ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి కొత్త ఇల్లు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ బుధవారం ఉదయం జగన్ దంపతులు గృహప్రవేశం చేశారు.వైఎస్ జగన్, భారతి దంపతులు ఉదయం 8.19 గంటలకు సర్వమత ప్రార్థనల మధ్య వాళ్ళ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.జగన్ కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సుభ కార్యక్రమానికి వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, తలశిల రఘురాంలు తదితరులు ఇందులో పాల్గొన్నారు.
ఆ తర్వాత పార్టీ నేతల సమక్షంలో జగన్ వైఎస్సార్‌సీపీ నూతన కేంద్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు,కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు,పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరయ్యారు.తాడేపల్లిలో జగన్ నూతన ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొనింది.దారిపొడుగునా పెద్ద పెద్ద బ్యానర్ లు,బాణాసంచాతో వైఎస్ఆర్సీపీ అభిమానులు తమ అభిమానాన్ని చూపుతున్నారు.రాష్ట్రంలో ప్రతీ జిల్లా,మండలాలు,గ్రామాల నుండి ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.