పాకిస్థాన్ కస్టడీ నుంచి విడుదలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ స్వదేశంలో అడుగు పెట్టిన మరుక్షణం భారతావనిలో సంబరాలు అంబరాన్నంటాయి. అప్పటివరకు ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న క్షణాలు ఆనందమయంగా మారిపోయాయి. భారతీయులంతా అభినందన్ రాకతో ఆనందోత్సాహాల్లో తేలియాడారు. ఇక నెల్లూరులోనూ సంబరాలు మిన్నంటాయి. క్రాంతినగర్ యూత్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. నగరంలో ర్యాలీ చేపట్టారు. రియల్ హీరో అభినందన్ కు సింహపురి వాసులు జేజేలు పలికారు. భారత్ మాతాకి జై అంటూ నినదించారు.
