ప్రతి అవ్వతాతకు, అక్క చెల్లమ్మలకు చెప్పండి జగనన్న ముఖ్యమంత్రి అయతే అన్నీ మంచి రోజులేనని చెప్పాలని వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రేణులకు సూచించారు. నెల్లూరు సమరశంఖారావం సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా సీఎం కుర్చీలో ఉండే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేశారని తెలిపారు. గత ఎన్నికల్లో మనకు, టీడీపీ మధ్య ఉన్న ఓట్ల తేడా ఎంతో తెలుసా కేవలం 5 లక్షల ఓట్లేనన్నారు. చంద్రబాబు వైసీపీ సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని, మీ ఓటు ఉందో లేదో ఓటర్ లిస్టులో చూసుకోవాలని కోరారు. ఓటర్ కార్డుపై ఉన్న ఎపిక్ నంబర్‌తో 1950కు ఎస్‌ఎంఎస్ ఇస్తే ఓటు ఉందో లేదో రిప్లై వస్తుందన్నారు.
ఓటు లేకపోతే ఆన్‌లైన్ ద్వారా ఫామ్–6 అప్లై చేసుకోవాలని, ఎంఆర్‌వో దగ్గర కూడా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. దొంగఓట్లు తీయించదలచుకుంటే ఫామ్–7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లోకి వెళ్తే సీ–విజిల్ అనే యాప్ కనిపిస్తుంది. మన స్మార్ట్ పోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. చంద్రబాబు ఎక్కడైనా అన్యాయం చేస్తున్నట్లు మీకు అనిపిస్తే మీ ఫోన్‌లోని ఆ సీవిజిల్‌యాప్‌ద్వారా రికార్డు చేసి సెండ్‌అనే బటన్ నొక్కండి. వంద నిమిషాల్లోనే దీనిపై యాక్షన్ తీసుకుంటారన్నారు.అందరూ కూడా సీ–విజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది మరిచిపోవద్దు చంద్రబాబు అనే మాయావితో యుద్ధం చేస్తున్నామన్నారు. పోలీసులు తమ టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్‌కొట్టాలి.
కానీ ఈ ప్రభుత్వం ఆ టోపీ వెనుక ఉన్న నక్కలకు సెల్యూట్ కొట్టిస్తోంది. ఇవాళ గ్రామాలకు తమ వారిని పంపించి వైయస్‌ఆర్‌సీపీ ఓట్లను ప్రభావితం చేయగలిగిన నాయకులను ఎలా కొనాలి? ఎంత డబ్బు ఇవ్వాలని దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల సమయంలో చంద్రబాబు డబ్బుమూటలతో వస్తున్నారు. ఒక్కొక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారని పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.