1.పోలీసులు IT Grids ఆఫీస్ కు వెళ్ళాక Seva Mitra App లో ఎందుకు Feb 27 న మార్పులు చేసారు?
2.తెలంగాణ పోలీస్ విచారణ వేగవంతం అయ్యాక సేవా మిత్ర అప్లికేషన్ ను ఎందుకు మూసివేశారు? మీ టీడీపీ వెబ్ సైట్ ఎందుకు డౌన్ అయింది?
3.ఐటి గ్రిడ్స్ పై తెలంగాణ పోలీసులు ఫిబ్రవరి 23నే దాడి చేసి డేటా తీసుకున్నారంటున్న ఎపి ప్రభుత్వం అరెస్టుల విషయం రచ్చకెక్కేవరకూ కిమ్మనకపోవడానికి కారణాలు ఏమిటి? మార్చి 4 తర్వాత కూడా ఐటి గ్రిడ్ తరపున హేబియస్ కార్పస్ వేశారే గాని తమ డేటా గురించి టిడిపి ఎందుకు కేసు వేయలేదు.
4.కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సిన కలర్ ఫోటో తో కూడిన ఓటర్ లిస్ట్ మీ సేవా మిత్ర అప్లికేషన్ లో ఎలా ఉంది?
5.కేవలం మీ 70 లక్షల టీడీపీ కార్యకర్తల డేటా మాత్రమే ఉంది అంటున్నారు కానీ పోలీస్ ప్రకారం 3 .5 కోట్ల ఆంద్ర ఓటర్ల డేటా ఎందుకు ఉంది?
మీరు టీడీపీ కి ఓటు వేయరు అనుకున్న వారి ఓట్లు తీసేయడం కోసమే కాకపోతే ఇదంతా ఎందుకు?
6.అసలు Ministry Of Corporate Affairs లో రిజిస్టర్ కానీ బ్లూ ఫ్రాగ్ కంపెనీ కి AP లో ఉన్న సీనియర్ IAS లు రిపోర్ట్ చేయాలి అని ఎందుకు లోకేష్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ జనవరి 29 న GORT 75 ద్వారా ఆదేశాలు ఇచ్చింది .
7.IT మంత్రి కూడా అయినా లోకేష్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడు?
8.ఏ తప్పు చేయకపోతే IT Grids CEO అశోక్ హైదరాబాద్ వదిలి అమరావతి లో ఎందుకు ఉన్నాడు
(మా దగ్గరే అమరావతి లో ఉన్నాడు అని మార్చి 7 న AP 24 /7 చర్చలో టీడీపీ అధికార ప్రతినిధి మాల్యాద్రి చౌదరి చెప్పాడు.. మార్చి 9 న జరిగిన ప్రెస్ మీట్ లో అశోక్ రెండు మూడు రోజుల్లో వస్తాడు అని బాబు కూడా చెప్పాడు అంటే మేమo దాచి పెట్టాము అని ఒప్పుకున్నట్టేగా )
9.తప్పు చేయకపోతే అశోక్ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు?