Home / 18+ / పార్టీ శ్రేణులంతా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన వైసీపీ

పార్టీ శ్రేణులంతా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన వైసీపీ

తూర్పు గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ నేత పినిపే విశ్వరూప్‌ అమలాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా సైకిళ్లు పంపిణీ చేయడం పట్ల విశ్వరూప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ నిబంధనలకు పాతరేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. అమలాపురం, రావులపాలెం, గోకవరంలో టీడీపీనేతలు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని, ఇవే కాకుండా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేయడానికి సైకిళ్లను సిద్ధంగా ఉంచారని తెలిపారు..

ఎన్నికల సమయంలో ప్రభుత్వ పధకాలు, తాయిలాలతో ప్రజలను లోబరచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలేనన్నారు. పైగా ఆ సైకిళ్లపై చంద్రబాబు, మంత్రి గంటా స్టికర్లతో పంపిణీ చేస్తున్నారని తెలిపారు. తాజాగా విశ్వరూప్‌ ఫిర్యాదు మేరకు కోడ్‌ ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటామని సదరు ఆర్డీవో తెలిపారు. అయితే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతాయని సీఎం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని వైసీపీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని ఆపార్టీ పిలుపునిస్తోంది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat