తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి శనివారం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సాఆర్ సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. లోటస్ పాండ్ లో ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు జగన్. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు.కాగా ఇవాళ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుట్టా రేణుక,ఆదాల ప్రభాకర్ రెడ్డి,మాజీ మంత్రి గూడూరు నియోజక వర్గం బల్లి దుర్గా ప్రసాద్,భూమా అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి వైసీపీలో చేరారు.
