వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో పాటు, రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల అంశంపై గవర్నర్ నరసింహన్కు జగన్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన ఆరోపణలు చేశారు.”శుక్రవారం పులివెందులలో మేము ఎస్పీతో మాట్లాడుతూ ఉండగానే, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్ చేశారు. దీన్ని బట్టి చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆయన ఎంత లోతుగామానిటర్ చేస్తున్నారనే దానికి నిదర్శం. ఈ హత్య కేసులో అడిషనల్ డీజీ పాత్ర ఉంది. చంద్రబాబు మా ఎమ్మెల్యేలను 20, 30 కోట్లతో ప్రలోభాలకు గురిచేస్తే… అంతకు ముందు వాళ్లతో… ఇదే వెంకటేశ్వరరావు, ఏబీఎన్ రాధాకృష్ణ మాట్లాడి డబ్బులిచ్చి, టీడీపీ కండువాలు కప్పారు.ఇదే వెంకటేశ్వరరావుగారు టీడీపీకి వాచ్మెన్ డిపార్ట్మెంట్గా మార్చేశారు. అటువంటి వెంకటేశ్వరరావు గారు… మా పార్టీ నుంచి వెళ్లిన 23 ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఉన్నారు ” అని జగన్ పేర్కొన్నారు.
